Kukunoor: వెంకటాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వెంకటాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి గండూరి తిరుమలరావు (25) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.
Kukunoor: వెంకటాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు!
కుక్కునూరు: మండలం వెంకటాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో ద్విచక్ర వాహనం అడ్డురావడంతో గండూరి తిరుమలరావు(25) అదుపుతప్పి లారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని వెంటనే బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




