Kukunoor: కుక్కునూరు, వేలేరుపాడులో పోలీసుల విస్తృత కూంబింగ్!

Kukunoor: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపట్టారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 20 Oct 2026 6:45 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు, వేలేరుపాడులో పోలీసుల విస్తృత కూంబింగ్!

కుక్కునూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలీసులు విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు.

గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కుక్కునూరు ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా స్పెషల్ పార్టీ బలగాలను మోహరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు బలగాలు అక్కడే ఉండి గ్రామాల్లో నిఘా కొనసాగించనున్నాయి.

త్వరలో గ్రేహౌండ్స్ బలగాలు కూడా కూంబింగ్ నిర్వహించనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR