Eluru: ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: జేసీ అభిషేక్ గౌడ!
Eluru: ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: ఏలూరు జేసీ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశం. రేషన్ బియ్యం అక్రమ రవాణా, తూకాల్లో మోసాలపై 6ఏ, క్రిమినల్ కేసులు.
Eluru: ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: జేసీ అభిషేక్ గౌడ!
ఏలూరు: ఏలూరు జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు,కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) డా.ఎం.జె.అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో ఆయన అధ్యక్షతన 'జిల్లా ఫుడ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ' సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రేషన్ పంపిణీ,మధ్యాహ్న భోజన పథకం,అంగన్వాడీ కేంద్రాలు,ప్రభుత్వ వసతి గృహాల్లో అందుతున్న ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు.రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేసినా,తూకాల్లో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని, అక్రమ రవాణాపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
త్వరలోనే మండల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తామని, సభ్యుల కోరిక మేరకు వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. సమావేశంలో సభ్యులు రేషన్ దుకాణాల్లో పనివేళల ప్రదర్శన, ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన వంటి పలు అంశాలను జేసీ దృష్టికి తెచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఎస్ఓ బాబు విలియమ్స్,పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి,డిఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి శారద,గిరిజన సంక్షేమ శాఖ డిడి పి.జనార్ధనరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




