Eluru: డీఎస్పీగా నమ్మించి మోసం: నకిలీ పోలీసు అరెస్ట్
Eluru: గుంటూరు డీఎస్పీగా చెప్పుకుంటూ ఎస్ఐ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన బత్తుల శ్రీనివాస్‌ను ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Eluru: డీఎస్పీగా నమ్మించి మోసం: నకిలీ పోలీసు అరెస్ట్
ఏలూరు జిల్లా: గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన బత్తుల శ్రీనివాస్ అలియాస్ శ్రీను,ఎస్‌ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని పాలిక రంగ వీరబాబు వద్ద రూ.18 లక్షలు, దండిపాటి గణేష్ వద్ద రూ.8 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు,డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు అక్టోబర్ 11న ఏలూరులోని జేకే ప్యాలెస్ లాడ్జిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి రూ.5.50 లక్షల నగదు,నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు,పోలీస్ స్టాంపులు, యూనిఫామ్,వాకీటాకీ స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో మోసం కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ బి.మధు వెంకటరాజు,హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లను ఎస్పీ అభినందించారు.




