Eluru: ఏలూరు జీజీహెచ్ సిబ్బందికి ప్రవర్తనా మార్పుపై శిక్షణ!
Eluru: ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బందికి ప్రవర్తనా మార్పు, కమ్యూనికేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోగులకు మెరుగైన సేవలందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల కోరారు.
Eluru: ఏలూరు జీజీహెచ్ సిబ్బందికి ప్రవర్తనా మార్పుపై శిక్షణ!
ఏలూరు: ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో నైపుణ్యాన్ని, రోగుల పట్ల మర్యాదపూర్వక వైఖరిని పెంపొందించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.శ్యామల పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో రోగుల సంతృప్తి స్థాయిని పెంచేందుకు ఈనెల 22 నుండి ప్రారంభమైన 'సిబ్బంది ప్రవర్తనా మార్పు - సమాచార ప్రసారం' శిక్షణ, పునశ్చరణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది.
ఈ సందర్భంగా డా.శ్యామల మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన,సానుకూల వాతావరణంలో వైద్య సేవలు అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. సోషల్ సైన్స్ విభాగానికి చెందిన సుబ్బారావు,ఎన్.రామకృష్ణ,కే.లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిబ్బందిలో సానుకూల ఆలోచనలు,మంచి అలవాట్లు పెంపొందించడం ద్వారా ఆసుపత్రి సేవల పై ప్రజల్లో నమ్మకం,విశ్వాసం పెరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




