Eluru: ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
Eluru: ఏలూరు శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయంలో గాంధీజీ 157వ జయంతిని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గాంధీ ఆశయాలపై అవగాహన కల్పించారు.
Eluru: ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
ఏలూరు: ఏలూరులోని శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయంలో అక్టోబర్ 2వ తేదీ సందర్భంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ జన్యావుల అంజిబాబు,పాఠశాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ కరస్పాండెంట్, ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గాంధీజీ ఆశయాలు,సత్యం,అహింస,క్రమశిక్షణ మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గాంధీజీ జీవితం,ఆయన సిద్ధాంతాలు మరియు దేశానికి చేసిన సేవలపై అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను తమ జీవితంలో ఆచరించాల్సిన అవసరాన్ని తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జన్యావుల అంజిబాబు,ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & కరస్పాండెంట్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సత్తెనపల్లి రాజ్ కుమార్, మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మంచి పౌరులుగా ఎదగాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.




