Eluru: ఏలూరు జిల్లాలో ఘనంగా పోలీస్ సంస్మరణ వారోత్సవాలు!
Eluru: ఏలూరు జిల్లాలో ఘనంగా పోలీస్ సంస్మరణ వారోత్సవాలు. అమీనాపేట పోలీస్ స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన జిల్లా పోలీసులు.
Eluru: ఏలూరు జిల్లాలో ఘనంగా పోలీస్ సంస్మరణ వారోత్సవాలు!
Eluru: ఏలూరు జిల్లా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఏలూరు జిల్లాలో అక్టోబర్ 21 నుండి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు నేడు అమీనాపేటలోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో "పర్యావరణ పరిరక్షణలో పోలీసుల పాత్ర" అనే అంశం పై విద్యార్థులు ఉత్సాహంగా వ్యాసాలు రాశారు.సమాజంలో పోలీసుల కీలక పాత్ర,వారి విధులు మరియు త్యాగాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని పోలీస్ అధికారులు తెలిపారు.వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలు,కళాశాలల్లో చర్చా వేదికలు,వక్తృత్వ, వ్యాసరచన పోటీలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది.




