Eluru: ఏలూరు జిల్లాలో వేగవంతమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకానికి కలెక్టరేట్ ఎన్‌ఐసీ కేంద్రంలో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2026 6:14 AM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో వేగవంతమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలనిర్వహణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రిసైడింగ్ అధికారుల (POs) శిక్షణా కేంద్రాల కేటాయింపుతో పాటు ఇతర పోలింగ్ సిబ్బందికి ఎన్నికల విధులను ఖరారు చేసేందుకు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ఐసి (NIC) కేంద్రంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి (DRO) ఎం.ముక్కంటి ఆధ్వర్యంలో మండలాల వారీగా ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్ఐసి అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎం. కృష్ణమోహన్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎన్ఐసి అధికారులు ఫణికృష్ణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్