Eluru: డ్వాక్రా మహిళల డిజిటల్ విప్లవం సొంత ఈ-కామర్స్ సైట్ ప్రారంభం!

Eluru: విజయవాడ సరస్ మేళాలో కొయ్యలగూడెం డ్వాక్రా సంఘం రూపొందించిన www.goodhealthfood.in ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Oct 2026 10:30 PM IST
Eluru
X

Eluru: డ్వాక్రా మహిళల డిజిటల్ విప్లవం సొంత ఈ-కామర్స్ సైట్ ప్రారంభం!

ఏలూరు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను డ్వాక్రా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

విజయవాడలో జరుగుతున్న జాతీయ ‘సరస్ మేళా’ను శుక్రవారం పరిశీలించిన ఆమె ఏలూరు జిల్లా నుండి హాజరైన 10 మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో భేటీ అయి అమ్మకాలు,వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలానికి చెందిన మదర్ థెరెసా స్వయం సహాయక సంఘం ఆన్‌లైన్ విక్రయాల కోసం సొంతంగా రూపొందించుకున్న www.goodhealthfood.in ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను పీడీ ప్రారంభించారు.

అనంతరం పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ఇప్పటికే ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌తో పాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా‘స్వయం ఏలూరు కనెక్షన్’ పేరిట ఆన్‌లైన్ సదుపాయం కల్పించారని గుర్తుచేశారు.ఈ క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో మదర్ థెరెసా సంఘం అధ్యక్షురాలు తోట కృపా స్నేహన్ 'గుడ్ హెల్త్ మిల్లెట్స్ ఫుడ్' బ్రాండ్‌తో సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను తేవటం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఎం పార్థసారథి,మదర్ థెరెసా ఎస్.హెచ్.జీ అధ్యక్షురాలు తోట కృపా స్నేహన్,సభ్యురాలు చిన్నం గవరమ్మ తదితరులు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్