Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!
Eluru: ఏలూరు జిల్లాలో 23 జడ్పీటీసీ, 408 ఎంపీటీసీ స్థానాల పోలింగ్ ముగిసింది. సీఆర్ రెడ్డి కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్ల మూడంచెల భద్రతను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్!
ఏలూరు: ఏలూరు జిల్లావ్యాప్తంగా 23 జడ్పీటీసీ,408 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల,పాలిటెక్నిక్ కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు.
ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి,ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్,డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీచేశారు.
నిరంతర నిఘా బ్యాలెట్ బాక్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ,స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అనధికార వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా నిరంతర పోలీస్ పహారా ఏర్పాటు చేయాలి, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ,ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలి, పోలింగ్ ముగిసినప్పటి నుంచి తదుపరి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇదే విధమైన పటిష్ట భద్రతను కొనసాగిస్తామని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.




