Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు
Eluru: ఏలూరు జిల్లాలో 27 జెడ్పీటీసీ, 27 ఎంపీపీ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, జనరల్కు 14 కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు
ఏలూరు: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ),27 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి బుధవారం తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు నం. 154 ఆదేశాల మేరకు ఈ రిజర్వేషన్లను తుది రూపం ఇచ్చారు.రెండు విభాగాల్లోనూ (జెడ్పీటీసీ, ఎంపీపీ) మొత్తం 27 స్థానాలకు గాను ఎస్టీలకు 4,ఎస్సీలకు 6,బీసీలకు 3,అన్-రిజర్వ్డ్ (జనరల్) కేటగిరీకి 14 స్థానాలు కేటాయించారు. మహిళలకు మొత్తం 13 స్థానాలు దక్కాయి.




