Eluru: ఏలూరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంవిధాన్ దివస్ ర్యాలీ!

Eluru: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పోక్సో స్పెషల్ జడ్జి కె. వాణిశ్రీ ర్యాలీని ప్రారంభించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 27 Nov 2026 7:52 AM IST
Eluru
X

Eluru: ఏలూరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంవిధాన్ దివస్ ర్యాలీ!

ఏలూరు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఫోక్సో స్పెషల్ జడ్జి కె.వాణిశ్రీ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రజల సుఖసంతోషాలకు ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీజూన్ మాట్లాడుతూ పౌరులు రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి మెలగాలని సూచించారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఎం.మీనాదేవి, ఆర్.వి.వి.యస్.మురళీకృష్ణ, ఐ.శ్రీనివాసమూర్తి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఎ.మేరీగ్రేస్ కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొనే సీతారాం, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid