Kukunoor: కుక్కునూరులో టీడీపీ హవా: 7 ఎంపీటీసీ స్థానాలు కైవసం!
Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. మాధవరం విజేత సున్నం మహేష్ ఎంపీపీ రేసులో నిలిచారు.
Kukunoor: కుక్కునూరులో టీడీపీ హవా: 7 ఎంపీటీసీ స్థానాలు కైవసం!
కుకునూరు: స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కుకునూరు మండలంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 7 స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్‌సీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మండలంలో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
మండలంలోని శ్రీధర వేలేరు ఎంపీటీసీ స్థానంలో తాళ్లూరి సురేష్ 899 ఓట్ల ఆధిక్యంతో, అమరవరం స్థానంలో తోటకూర రజిత 240 ఓట్ల ఆధిక్యంతో, మాధవరం స్థానంలో సున్నం మహేష్ 140 ఓట్ల ఆధిక్యంతో, దామరచర్లలో గోడ్ల వెంకటేశ్వరరావు 98 ఓట్ల ఆధిక్యంతో, కుక్కునూరు-1లో పిచ్చుక రాజు 61 ఓట్ల ఆధిక్యంతో, కుక్కునూరు-2లో ఆశీ శ్రీలత 251 ఓట్ల ఆధిక్యంతో, దాచారంలో కంటే వెంకట నరసమ్మ 582 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
అదేవిధంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గణపవరం ఎంపీటీసీ స్థానంలో కాటవరపు వసంత 756 ఓట్ల ఆధిక్యంతో, గింజరం స్థానంలో నూనె జ్యోతి 19 ఓట్ల ఆధిక్యంతో, కివ్వాకలో ఉకే రాధ 70 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున మాధవరం ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించిన సున్నం మహేష్ ఎంపీపీ పదవి రేసులో ఉండటంతో మండల రాజకీయాల్లో ఆయన పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది. మొత్తం మీద కుక్కునూరు మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఏడు స్థానాలు గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.




