Kukunoor: కుక్కునూరులో టీడీపీ హవా: 10 ఎంపీటీసీల్లో 7 కైవసం!
Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది.
Kukunoor: కుక్కునూరులో టీడీపీ హవా: 10 ఎంపీటీసీల్లో 7 కైవసం!
కుక్కునూరు: మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, మిగిలిన 3 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థులు దాచారం, కుక్కునూరు-1, కుక్కునూరు-2, మాధవరం, ఉప్పేరు, అమరవరం, శ్రీధర వెలేరు ఎంపీటీసీ స్థానాల్లో విజయభేరి మోగించారు. కివ్వాక, విజరం, పెదరాయిగూడెం ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు.
మొత్తం 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంతో టీడీపీ, కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా, కుక్కునూరు మండల జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జడ్పీటీసీ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.




