Eluru: అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: డీఎఫ్‌వో సందీప్ రెడ్డి!
Eluru: ఏలూరు జిల్లా అటవీ డివిజన్ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరుల త్యాగాలు మరువలేనివని డీఎఫ్‌వో పి.వి.సందీప్ రెడ్డి కొనియాడారు.
Eluru: అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: డీఎఫ్‌వో సందీప్ రెడ్డి!
ఏలూరు: ఏలూరు జిల్లా అటవీ డివిజన్ కార్యాలయంలో 'రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం' ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి పి.వి.సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని,అమరవీరుల స్మారక ఫలకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ అడవులను, వన్యప్రాణులను స్మగ్లర్ల నుండి కాపాడేందుకు ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
అలాగే ఏలూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ అడవుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బంది కుటుంబాలకు అటవీ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులు, సిబ్బంది కలిసి అటవీ, వన్యప్రాణి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో పర్యావరణంపై చైతన్యం తెచ్చేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




