Eluru: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి!

Eluru: ఏలూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. కామవరపుకోట మండలంలోని పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 27 Nov 2026 7:57 AM IST
Eluru
X

Eluru: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి!

ఏలూరు: ఏలూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కామవరపుకోట మండలం తడికలపూడి, కామావరపుకోటలలో జిల్లా పరిషత్ హైస్కూల్స్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని గురువారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం చేసిన పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతవాతావరణంలో జరిగాయన్నారు.

ఏలూరు జిల్లాలో మొదటి విడతలో పంచాయతీ ఎన్నికలను బుట్టాయిగూడెం,జంగారెడ్డిగూడెం,జీలుగుమిల్లి,కామవరపుకోట,కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి. నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 164 గ్రామాలలోని సర్పంచ్ లు,1567 వార్డ్ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు.

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 619 మంది రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులను నియమించడం జరిగిందని, 6193 మంది పోలింగ్ సిబ్బందిని పోలింగ్ నిర్వహణ కోసం నియమించడం జరిగిందన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయినవెంటనే ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. కఈ కార్యక్రమంలోకలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి.రమణ,తహసీల్దార్ గెడ్డం ఎలీషా ప్రభృతులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid