Eluru: ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులను కలెక్టర్ వెట్రిసెల్వి అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Oct 2026 7:11 PM IST
Eluru
X

Eluru: ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు

ఏలూరు: ఏలూరు జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ప్రజా సమస్యలు పరిష్కారం,ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడం,ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అమలను నిబద్ధతతో పనిచేసిన అధికారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులను అందజేశారు.

వీరికి జ్ఞాపికలు ఇచ్చి,శాలువాలను కప్పి జిల్లా కలెక్టరు ఘనంగా సన్మానించారు.నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న,ఏలూరు ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న,జంగారెడ్డిగూడెం ఆర్డీవో యం.వి.రమణ,తహశీల్దార్లు భీమడోలు బి.రమాదేవి,చాట్రాయి జి.స్వాతి,ఉంగుటూరు యం.సన్యాసిరావు, నూజివీడు షేక్ సంసిద్దీన్, లింగపాలెం మండలం డిప్యూటీ తహశీల్దారు స్రవంతిలు బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డులు పొందారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ​విధి నిర్వహణలో అంకితభావం,ప్రభుత్వ లక్ష్యాలను అమలు చేసి బాధ్యతాయుతమైన పనితీరును కనబరిచే వారికి ఎల్లప్పుడూ సరైన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.​ప్రజాసంక్షేమమే పరమావధిగా అధికారులు,ఉద్యోగులు పనిచేయ్యాలని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అన్నారు.

తోటి అధికారులు,ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలు సంతృప్తి చెందేసేవలు మన జీవితానికి మంచి దీవెనలు అందుతాయని అన్నారు.​ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,విజిలెన్స్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి,సర్వే సహాయం సహాయ సంచాలకులు అన్సారీ,తహశీల్దార్లు,డివిజన్,మండల సర్వేయర్లు,జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్