Eluru: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు పెంపు: కలెక్టర్!

Eluru: 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచిందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 9:39 PM IST
Eluru
X

Eluru: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు పెంపు: కలెక్టర్!

ఏలూరు: 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తాలను పెంచిందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

5 వేల లోపు జనాభా: రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా: రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా: రూ.50 లక్షలు

సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిధులను గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలని,అధికారుల ధ్రువీకరణ అనంతరం గ్రామ పంచాయతీ పదవీకాలంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ పెంపు 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్