Eluru: ఏలూరు జిల్లా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్
Eluru: ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక ఎన్నికల షెడ్యూల్ను కలెక్టర్ కె.వెట్రిసెల్వి విడుదల చేశారు. అక్టోబర్ 28న పోలింగ్, 30న కౌంటింగ్ జరగనుంది.
Eluru: ఏలూరు జిల్లా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల ఎన్నికల షెడ్యూల్ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి శనివారం వెల్లడించారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని,19న వాటిని పరిశీలిస్తామని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉంటుందని, అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఈనెల 28వ తేదీన ఉదయం నుండి పోలింగ్ నిర్వహిస్తామని,30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి,అక్కడ అదనపు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ ఇప్పటికే అన్ని అంశాల పై పూర్తిస్థాయి శిక్షణ పూర్తి చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి వివరించారు.




