Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వారోత్సవాలు!

Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోడల్ మేకింగ్ పోటీలు నిర్వహించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 18 Nov 2026 12:35 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వారోత్సవాలు!

ఏలూరు: ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో "59వ" జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం ఎంతో ఘనంగా, ఉత్సాహoగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంస్థ అయిన ప్రజా ప్రజా పిత బ్రహ్మకుమారి ఈశ్వరీ య విశ్వ విద్యాలయం, ఏలూరు యూనిట్ మెడిటేషన్ ట్రైనర్ అండ్ సెంటర్ హెడ్ రాజయోగిని బీకే లావణ్య ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ఉన్న ప్రైవేట్ అండ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల చేత "స్మార్ట్ సిటీ - భవిష్యత్ నగరం" మరియు "సహజ వనరులను పరిరక్షించండి భూ మాత ను కాపాడండి" అనే అంశాలపై "మోడల్ మేకింగ్ ప్రెజెంటేషన్" పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణరావు,జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది పాఠకులు, తదితరులు, పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid