Eluru: అగ్రిస్టాక్ కింద రైతుల భూమి, పంటల వివరాలు డిజిటల్ నమోదు
Eluru: ఏలూరు జిల్లాలో అగ్రిస్టాక్ కింద రైతుల భూమి, పంటల వివరాల డిజిటల్ నమోదుకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశం; ఫార్మర్ ఐడితో పథకాల వేగవంతం.
Eluru: అగ్రిస్టాక్ కింద రైతుల భూమి, పంటల వివరాలు డిజిటల్ నమోదు
ఏలూరు: ఏలూరు జిల్లాలోని రైతుల భూమి యాజమాన్య వివరాలు,పంటల సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.అగ్రిస్టాక్ (AgriStack) అమలుపై సోమవారం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో కలెక్టరేట్ నుండి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ అగ్రిస్టాక్ విధానం ద్వారా ప్రతి రైతుకు ప్రత్యేకమైన 'ఫార్మర్ ఐడి' (Farmer ID) లభిస్తుందని,తద్వారా పంటల బీమా, రాయితీలు,బ్యాంక్ రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలు వేగంగా అందుతాయని కలెక్టర్ తెలిపారు.రైతులు తమ ఆధార్,భూమి మరియు పంటల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లో కానీ,లేదా గ్రామ, మండల వ్యవసాయ కార్యాలయాలు,సి.ఎస్.సి (CSC) కేంద్రాలలో కానీ నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.
సర్వే వివరాలను క్రోడీకరించి సెంట్రల్ డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.అలాగే,పంటల బీమా పథకానికి సంబంధించి అర్హత కలిగిన మరియు లేని దరఖాస్తుల జాబితాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు.ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ,డి.ఆర్.ఓ జి.రవీందర్,జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా తదితరులు పాల్గొన్నారు.




