Eluru: హెచ్‌ఐవీ నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి!

Eluru: ఏలూరు జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 7:44 PM IST
Eluru
X

Eluru: హెచ్‌ఐవీ నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి!

ఏలూరు: ఏలూరు జిల్లాలో హెచ్‌ఐవి వ్యాధి వ్యాప్తి నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో వైద్య శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్రామీణ ప్రాంతాలు, పరిశ్రమలు, వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాలలో హెచ్‌ఐవి పరీక్షలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రైవేట్ వ్యాధి నిర్ధారణ కేంద్రాలలో హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను సేకరించి,వారికి తక్షణమే చికిత్స అందేలా చూడాలి అని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారి వివరాలను పర్యవేక్షిస్తూ,ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని

యువత,ఎన్జీవోల భాగస్వామ్యంతో సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలి అని ముఖ్యంగా కళాశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి అని ఎయిడ్స్ బాధితుల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా,వారికి మానసిక ధైర్యాన్ని అందించడం అందరి బాధ్యత అని అన్నారు. జిల్లా ప్రజలందరికీ ఉచిత వైద్య భద్రత అందించేలా, వ్యాధులు రాకముందే గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.

వారి గత వ్యాధులు, ప్రస్తుత ఆరోగ్య సమస్యలు, అందుతున్న చికిత్స వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.యు. శోభ,డిసిహెచ్ఎస్ డా.బేబీ కమల, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా ఎయిడ్స్ నివారణాధికారి డా.ఎన్.లక్ష్మీనారాయణ, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జి.శ్యామల తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్