Eluru: కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి కలెక్టర్ వెట్రిసెల్వి నివాళులు
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి యువతకు సందేశం అందించారు.
Eluru: కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి కలెక్టర్ వెట్రిసెల్వి నివాళులు
ఏలూరు: గాంధీజీ చూపిన శాంతి,అహింసా మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.గాంధీజీ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి,చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహా మనిషి గాంధీజీ అని, ఆయన చూపిన బాటలో నేటి యువత నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
గాంధీజీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్,ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి, కలెక్టరేట్ సిబ్బంది,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




