Eluru: పెదవేగిలో ఎంపీటీసీ నామినేషన్లను తనిఖీ చేసిన కలెక్టర్!
Eluru: ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి. అధికారులకు కీలక ఆదేశాలు.
Eluru: పెదవేగిలో ఎంపీటీసీ నామినేషన్లను తనిఖీ చేసిన కలెక్టర్!
Eluru: ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో జరుగుతున్న ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా,స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని కలెక్టర్ స్పష్టం చేశారు.నామినేషన్ల దాఖలు ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేదా బెదిరింపులు ఎదురైనా,వెంటనే దగ్గరలోని పోలీసు సిబ్బందికి లేదా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని,వారిపై తక్షణ చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు.నామినేషన్ల స్వీకరణ కేంద్రం లోపల,బయట సిసి కెమెరాలు ఏర్పాటు చేసి,మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం పోలింగ్ కేంద్రంలో కల్పించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మిప్రసన్న,తహసీల్దార్లు,ఎంపిడిఓలు,రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.




