Eluru: కలెక్టరేట్ తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్!

Eluru: ఏలూరు కలెక్టరేట్ తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 8:56 PM IST
Eluru
X

Eluru: కలెక్టరేట్ తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్!

ఏలూరు: 'అర్నబ్' తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్ కాల్స్, ప్రజల ఫిర్యాదుల నమోదు ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా రోడ్లు,విద్యుత్,త్రాగునీరు వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదును తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు పంపాలి అని ఏ సమస్య ఏ శాఖకు పంపారు?దాని పరిష్కార విధానం ఏంటి? అనే వివరాలు రిజిస్టర్‌లో స్పష్టంగా ఉండాలి అని కలెక్టర్ సూచించారు.

మండలాల నుండి తుఫాన్ నష్టాలపై నివేదికలు సేకరించి, ఏకీకృత నివేదికను సమర్పించాలి అని అన్నారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్డీసీ దేవకీదేవి,కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్యతో పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్