Eluru: ఆమని చెరువు ఆయకట్టు సమస్యలపై కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలన
Eluru: ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సగ్గూరు ఆమని చెరువు ఆయకట్టు సాగునీటి సమస్యలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Eluru: ఆమని చెరువు ఆయకట్టు సమస్యలపై కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలన
Eluru: ఆమని చెరువు ఆయకట్టు రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలం సగ్గూరులోని ఆమని చెరువు ఆయకట్టు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆమని చెరువు నీటిని తమ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, తమ సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సగ్గూరుకు చెందిన పలువురు రైతులు కలెక్టర్ ను కోరారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, కృష్ణాజిల్లా ఇరిగేషన్ యస్ఇ గునకరరావు, ఇఇ కె.బాబు, మత్స్యశాఖ సహాయ సంచాలకు బి.రాజ్ కుమార్, తహశీల్దారు పి.యన్.వి.ప్రసాదు, ఇంచార్జి యంపిడివో అబ్దుల్ సలామ్, ఇరిగేషన్ ఏఇ జి.వెంకటేష్, రెవిన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్, పోలీసు అధికారులు, స్థానిక రైతునాయకులు, రైతులుస్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




