Eluru: కౌంటింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్!

Eluru: ఏలూరు నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావుండొద్దని కలెక్టర్ వెట్రిసెల్వి సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సిబ్బంది శిక్షణలో ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Oct 2026 6:39 PM IST
Eluru
X

Eluru: కౌంటింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్!

Eluru: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.శుక్రవారం స్థానిక సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడతో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్స్ సీల్ తెరవడం, ఓట్ల లెక్కింపు,ఓట్ల చెల్లుబాటు పరిశీలన వంటి అంశాలపై సిబ్బందికి స్వయంగా అవగాహన కల్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నారు.ఓటు చెల్లుబాటుపై ఏవైనా సందేహాలుంటే వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు,ఇతర వస్తువులకు అనుమతి లేదని, వాటిని బయట ప్రత్యేక కేంద్రంలో భద్రపరచాలని స్పష్టం చేశారు.తొలుత పోస్టల్ బ్యాలెట్లు,ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల ఓట్లను నిబంధనల ప్రకారం లెక్కించాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత,కౌంటింగ్ హాల్స్, టేబుల్స్ ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.అనంతరం కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భానుప్రతాప్,కౌంటింగ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్