Eluru: డ్రగ్స్ నివారణకు సమన్వయంతో పనిచేయాలి - కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరులో ఎన్కార్డ్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి. జిల్లాలో డ్రగ్స్ కట్టడికి సీసీ కెమెరాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశం.
Eluru: డ్రగ్స్ నివారణకు సమన్వయంతో పనిచేయాలి - కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు: ఏలూరు జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ,నివారణే ధ్యేయంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.బుధవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన NCORD (నార్కో కోఆర్డినేషన్) కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 31 నుండి నేటి వరకు జిల్లాలో నమోదైన నార్కోటిక్ కేసులు,చేపట్టిన అవగాహన కార్యక్రమాల పై ఈ సమావేశంలో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు అధికారులకు జారీ చేసిన ముఖ్య ఆదేశాలు:హాట్‌స్పాట్స్ గుర్తింపు: వాడుకలో లేని భవనాలు,డ్రగ్స్ సంచారం ఉన్న ప్రాంతాల్లో పొదలను తొలగించి,సిసిటివి (CCTV) కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు పోలీస్,ఈగిల్ (EAGLE) సెల్ సమన్వయంతో విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని డిఇఓ (DEO) కు సూచించారు.'LEAAP' యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
డ్రగ్స్‌కు బానిసైన వారికి ఈగిల్ టీమ్,పోలీస్, జిజిహెచ్ (GGH) ఏలూరు ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ సెంటర్లలో చేర్చి నిరంతర చికిత్స అందించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ ఎస్.కె.కరీం,డిపిఓ జి.వి.జి. మల్లిఖార్జున రావు,డిఇఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డిపిటిఓ ఎస్.కె. షబ్నమ్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఈగిల్ టీమ్ ఇంచార్జ్ బి. ఉదయ్ భాస్కర్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




