Eluru: అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలలో 2,53,360 మంది పింఛన్దారులకు రూ. 111.69 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
Eluru: అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలలో 2,53,360 మంది ఫించన్ దారులకు 111.69 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.జిల్లాలో అక్టోబర్ నెల పించను పంపిణి పై జిల్లాలోని ఎంపిడిఓలు మరియు మునిసిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పించను పధకము కింద పింఛనును అక్టోబర్,1వ తేదీ ఉదయం 7 గంటల నుండి గంటలకు నుండి అందించడం జరుగుతుందన్నారు.ఏలూరు జిల్లాలో అక్టోబర్ 1వ తేదీన తీసుకోని వారికి 2వ తేదీ న పంపిణీ చేయబడుతుందన్నారు.
జిల్లాలో 4925 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఫించనల పంపిణీకి ఏర్పాటులు చేయడమైనదన్నారు.1వ తేదిన పించను పంపిణికి ఎటువంటి నగదు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు.పింఛను పొందేందుకు పింఛను దారులు సచివాలయ సిబ్బంది ద్వారా వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా
ముందస్తు సమాచారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయ లక్ష్మి ఇంచార్జ్ జెడ్పి సీఈఓ మల్లికార్జునరావు,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.




