Eluru: పీజీఆర్‌ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్‌తో స్పందించండి: కలెక్టర్ వెట్రిసెల్వి

Eluru: ఏలూరు జిల్లాలో పీజీఆర్‌ఎస్ సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ సంతృప్తి స్థాయిని, అభిప్రాయాలను నమోదు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 9:08 PM IST
Eluru
X

Eluru: పీజీఆర్‌ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్‌తో స్పందించండి: కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పిజిఆర్ఎస్ ద్వారా అందిన సేవల పై ప్రజల అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలనీ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు.ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజలను అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా కోరుతున్నదన్నారు.

జిల్లా,మండల స్థాయి పిజిఆర్ఎస్ కేంద్రాలలో ప్రవేశ,నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించడం జరిగిందన్నారు.

పి.జి.ఆర్.ఎస్ సేవలు పొందిన ప్రజలు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని, సంతృప్తి స్థాయిని తెలియజేయవచ్చన్నారు.క్యూ.ఆర్ కోడ్ ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్‌ చేరుతుందన్నారు.

ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్