Eluru: 5న ఏలూరులో యథావిధిగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు కలెక్టరేట్ గోదావరి హాలుతో పాటు మండల, మున్సిపల్ స్థాయిల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి పీజీఆర్‌ఎస్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Eluru: 5న ఏలూరులో యథావిధిగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా: ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో ఈనెల 5వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో యధావిధిగా పిజిఆర్ఎస్,రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు* నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
పిజిఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు,భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు(PGRS) సేవలను అక్టోబర్,5వ తేదీ సోమవారం మండల,డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాల్లో,డివిజనల్ కార్యాలయాల్లో,లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చన్నారు.అలాగే,ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రభుత్వం అందించిన అధికారిక వెబ్‌సైట్: https://meekosam.ap.gov.in
ఈ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి,సమయానుకూలంగా పరిష్కారమవుతాయన్నారు.




