Eluru: నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా కలెక్టర్
Eluru: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలనను ఎన్నికల నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి.
Eluru: నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా కలెక్టర్
ఏలూరు: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఏలూరు కలెక్టరేట్ నుండి శుక్రవారం సాయంత్రం జెడ్పిటిసి,ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు,సిబ్బందితో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పిటిసి,ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో అభ్యర్థులు అందించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని,ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.నామినేషన్ పత్రాలను ఎన్నికల కమీషనర్ నియమ నిబంధనల మేరకు ఉన్నాయా,లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఎటువంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా నామినేషన్ పత్రాల పరిశీలన చేయాలన్నారు.తిరస్కరించిన నామినేషన్ పత్రాలను నగరపాలక సంస్థ నోటీస్ బోర్డులో పెట్టి,సంబంధిత అభ్యర్థులకు వెంటనే తెలియజేయాలన్నారు.చెక్ లిస్ట్ లో చెప్పిన అభ్యంతరాలపై అభ్యర్థులు ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా,డిక్లరేషన్ సమర్పించకపోయినా నామినేషన్ రిజెక్ట్ చేయవచ్చన్నారు.అభ్యర్థి ఓటు హక్కు ఉన్న ప్రదేశం,నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకుని,బలపరచినవారి వివరాలు, సంతకం,ఓటుహక్కు ప్రదేశం వంటివి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
నామినేషన్ ను అంగీకరించి లేదా తిరస్కరణ విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని , పక్షపాతధోరణి వహిస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,జిల్లా పరిషత్ సీఈఓ ఎం.కృష్ణ మోహన్,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ,ఆర్ఓ లు,ఏఆర్ఓ లు పాల్గొన్నారు.




