Eluru: జెడ్‌పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ ఆకస్మిక తనిఖీ!
Eluru: ఏలూరు జిల్లాలో జెడ్‌పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కే. వెట్రిసెల్వి. 27 జెడ్‌పిటిసి, 454 ఎంపిటిసి స్థానాలకు ముగిసిన ప్రక్రియ.
Eluru: జెడ్‌పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ ఆకస్మిక తనిఖీ!
ఏలూరు: ఏలూరు జిల్లాలో జెడ్‌పిటిసి,ఎంపిటిసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఏలూరు ఎంపిడిఓ కార్యాలయం,జిల్లా పరిషత్‌లలో జరుగుతున్న నామినేషన్ల దాఖలును పరిశీలించి,అభ్యర్థులతో స్వయంగా మాట్లాడారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు అని సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక భద్రత కల్పించామని ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు నామినేషన్ల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.
నామినేషన్ల దాఖలులో ఆటంకాలు లేదా బెదిరింపులు ఎదురైతే 18002331077, 018812-224519 నంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.జిల్లాలోని 27 జెడ్‌పిటిసి,454 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది.
శనివారం (రేపు) నామినేషన్ల పరిశీలన జరుగుతుంది అని ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,జెడ్పీ సీఈఓ కృష్ణ మోహన్,ఆర్డీఓ లక్ష్మిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.




