Eluru: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ

Eluru: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులకు సీట్ల కేటాయింపు, పెండింగ్ బకాయిలపై ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 11:06 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ

ఏలూరు: ఏలూరు జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరుకు,జిల్లా పరిషత్తు డిప్యూటీ సిఇవో కె.భీమేశ్వర్,ఇతర అధికారులు పూలమొక్కలను అందజేశారు.

అనంతరం అధికారులు,ఉద్యోగులు పేరుపేరునా పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండి,అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానం ఇచ్చేలా ఉండాలని అన్నారు.బదిలీపై వచ్చిన ఉద్యోగులకు ఇంకా సీట్లు కేటాయించక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు.

వెనువెంటనే సీట్లు కేటాయించి,విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు.రాబోయే ఎన్నికలకు అధికారులు,ఉద్యోగులు సంసిద్ధులే ఉండాలని అన్నారు.పిజిఆర్ఎస్ ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని,ఎన్ని పరిష్కారం చూపారని,ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంటు,పిఎఫ్ లు, తదితర బకాయిలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కార్యాలయంకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు,సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని అన్నారు.రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు,పెండింగు అంశాలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.అధికారులు,సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులకు హాజరై,తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇవో కె.భీమేశ్వర్,ఏవో కె.వి.విక్టర్ జాన్సన్,అధికారులు,ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్