Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో పీఎం కేర్స్ ఫర్ ఆర్ఫన్ చెక్కులు అందజేత
Eluru: కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు పీఎం కేర్స్ పథకం కింద రూ.10 లక్షల చెక్కులను ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అందజేశారు.
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో పీఎం కేర్స్ ఫర్ ఆర్ఫన్ చెక్కులు అందజేత
ఏలూరు: ప్రధానమంత్రి కేర్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ పథకం ఇద్దరి బాలికలకు 10 లక్షల రూపాయల చొప్పున రెండు చెక్కులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో అందజేశారు.మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ,భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలుపరుస్తున్న కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన బాలలందరికి ఆర్థిక భరోసా కల్పిస్తూ భవిష్యత్తు పైన ఆశలను పెంపొందించే
విధంగా అమలు పరుస్తున్న ప్రధానమంత్రి కేర్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ పథకం ద్వారా 23 సంవత్సరంల వయస్సు పూర్తయిన తర్వాత లభించే 10 లక్షల రూపాయల చెక్కులను మరియు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అకౌంట్ నుండి విడుదల అయిన వడ్డీ లను కలిపి పోస్టల్ అకౌంట్ పాస్ పుస్తకాలను భీమడోలు కి సంబంధించిన కుమారి.కమరపు.గోపిక శ్రీ, మరియు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొవ్వూరు కి సంబంధించిన కుమారి.జుజ్జవరపు.సాయి భార్గవి లకు కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి కేర్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ పథకం కింద వచ్చిన సొమ్మును జాగ్రత్తగా తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో స్థిరపడాలని దానికి కుటుంబ సభ్యుల సహకారంతో పాటు ప్రభుత్వం యంత్రాంగం కూడా అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్.సూర్యచక్ర వేణి,డిసిపియు సిబ్బంది,శ్రీకాంత్ మహేష్,శంకర్,రాజకుమార్,బాలికల గార్డియన్ లు పాల్గొన్నారు.




