Eluru: ఏలూరు కార్పొరేషన్‌లో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ!

Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Oct 2026 9:14 AM IST
Eluru
X

Eluru: ఏలూరు కార్పొరేషన్‌లో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ!

Eluru: ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నగరపాలక,పురపాలక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని,ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.

అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.నామినేషన్‌ వేసేందుకు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిర్వహణా చర్యలు తీసుకోవాలన్నారు.నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని,నిబంధనల మేరకు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని,బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్‌,కౌంటింగ్‌ ప్రక్రియలపై సంబంధిత సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలన్నారు.

జిల్లాలోని ఎన్నికల సమాచారం,ఫిర్యాదులు నమోదు తదితరాలకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్‌,పోలింగ్‌,కౌంటింగ్‌ సమయాలలో ఆయా కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు.

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి,ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌,డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌, ఏఏలూరు (టూటౌన్‌): ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.

అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.నామినేషన్‌ వేసేందుకు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిర్వహణా చర్యలు తీసుకోవాలన్నారు.నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిబంధనల మేరకు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని,బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్‌,కౌంటింగ్‌ ప్రక్రియలపై సంబంధిత సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలన్నారు.

జిల్లాలోని ఎన్నికల సమాచారం,ఫిర్యాదులు నమోదు తదితరాలకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్‌,పోలింగ్‌,కౌంటింగ్‌ సమయాలలో ఆయా కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు.

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి,ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌, ఏలూరు నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏలూరు నగరపాలక సంస్థలోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు.ఏలూరు నగరపాలక సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఏలూరు నగరపాలక సంస్థలోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్‌,ఎస్పీ పరిశీలించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్