Eluru: ఏలూరులో అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం

Eluru: ఏలూరులో అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి, వస్తువులు కొనుగోలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 10:12 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం

ఏలూరు: ఏలూరు జిల్లా పరిషత్తు సమావేశమందిరంలో మంగళవారం అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.అంతర్జాతీయ సంకేత భాషల ( SIGN LANGUAGES) దినోత్సవం సందర్భంగా దివ్యాంగులతో కలసి కేకును కట్ చేసి,కేకుముక్కలు అందరికీ పంచి,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు.

దివ్యాంగులు స్వయంగా తయారుచేసిన వస్తువులను పరిశీలించి జిల్లా కలెక్టరు డబ్బులు చెల్లించి వస్తువులను కొనుగోలు చేసుకున్నారు.సంకేత భాషల జిల్లా అధ్యక్షులు,కార్యవర్గసభ్యులకు జ్ఞాపికలను ఇచ్చి,శాలువాలను కప్పి జిల్లా కలెక్టరు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సంకేత భాషతోనే సమ్మిళిత సమాజ నిర్మాణం సాధ్యమని,మాట్లాడే శక్తి, వినికిడి లోపం ఉన్న వ్యక్తులు హక్కులను కాపాడటంలో సంకేత భాష (సైన్ లాంగ్వేజ్) కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, సంకేత భాషకేవలం ఒక మాధ్యమం మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్నవారి ఆత్మ గౌరవానికి,భావవ్యక్తీకరణకు బలమైన సాధనమని అన్నారు. దివ్యాంగులు సమాజంలో ఎవరికీ తీసిపోకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు సంకేత భాష ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ​ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో సంకేత భాషను ప్రోత్సహించి,సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.

జిల్లా యంత్రాంగం తరపున దివ్యాంగులు సంక్షేమానికి, వారి సాధికారతకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేరువ చేస్తామని హామీ ఇచ్చారు.చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా ఋణ సౌకర్యాలు కల్పిస్తామని,ఉత్సాహం ఉన్నవారు ముందుకు రావాలని అన్నారు. ​దివ్యాంగులు పట్ల ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఉండి,వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా దివ్యాంగులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, సెట్ వెల్ సిఇవో కె.యస్.ప్రభాకరరావు,డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి,మెప్మా పిడి యం.రాజబాబు,జిల్లా టూరిజం మేనేజరు యస్.పట్టాభిరామన్న,జిల్లా సాంకేత భాషల అధ్యక్షులు గాదిరాజు ప్రవీణ్ వర్మ,కార్యవర్గ సభ్యులు,దివ్యాంగులు వారి కుటుంబసభ్యులు,జిల్లా దివ్యాంగులు,డిఆర్డిఏ,మెప్మా శాఖలు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్