Eluru: మురసు తుఫాన్ హెచ్చరికలు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
Eluru: మురసు తుఫాన్ ముప్పు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి. సీఎం చంద్రబాబు రివ్యూ కాన్ఫరెన్స్లో ముందస్తు చర్యల వివరణ.
Eluru: మురసు తుఫాన్ హెచ్చరికలు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఏలూరు: మురసు తుఫాన్ ప్రభావం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలిపారు.రాష్ట్రంలో తుఫాన్ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మురసు తుఫాన్ కారణంగా భారీ వర్షాలు,తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రాణ,ఆస్థి నష్టాల నివారణపై జిల్లాల కలెక్టర్లు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు .
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.రిజర్వాయర్లు, చెరువులు నీటిని నింపేలా సమర్ధ నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో తుఫాన్ సన్నద్ధతపై తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలను సీఎం కి తెలియజేసారు.మురసు తుఫాన్ ప్రభావం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని,జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని,లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని,తుఫాన్,భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ,ఆస్థి నష్టాలు సంబంవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.




