Eluru: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భద్రత, సిసి కెమెరాలను పరిశీలించారు.
Eluru: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు: ఏలూరు జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను మంగళవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం యంత్రాలు బి.యులు,సియులు,వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను పరిశించారు.
అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంతకం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు,సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు,మొదలైనవి పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు.ఎప్పటి కప్పుడు గౌడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదికy పంపిస్తున్నామన్నారు.ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్చి జిల్లా రెవెన్యూ అధికారి,ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి,వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు సహదేవ అచ్యుతబాబు టిడిపి,వి.స్టాన్లీబాబు,ఎల్.వి.సుభాష్ వైఎస్ఆర్సిపి,కె.శ్రీనివాసరావు,డి.యన్.వి.డి.ప్రసాదు,సిపిఐ (యం),చేకూరి గణపతి బిజెపి,ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.




