Eluru: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు పోటీలు!
Eluru: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ఐదో రోజు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు బుధవారం నిర్వహించారు.
Eluru: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు పోటీలు!
ఏలూరు జిల్లా: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం,క్విజ్ పోటీలు నిర్వహించారు.గ్రంథాలయాల ప్రాముఖ్యత,“నేర్చుకోవడానికి చదవండి–నాయకత్వం వహించడానికి నేర్చుకోండి” వంటి అంశాలపై నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.కరెంట్ అఫైర్స్,జనరల్ నాలెడ్జ్‌పై క్విజ్ పోటీలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించగా,మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా పలువురు కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రముఖ జర్నలిస్ట్ చలసాని వెంకట సురేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణరావు, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.




