Eluru: 'అర్నాబ్' తుఫాను ఎఫెక్ట్ విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు!

Eluru: అర్నాబ్ తుఫానుతో ఏలూరు జిల్లాలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం. 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు. తెగిన విద్యుత్ వైర్లను తాకొద్దని ఎస్ఈ అంబేద్కర్ హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 5:39 PM IST
Eluru
X

Eluru: 'అర్నాబ్' తుఫాను ఎఫెక్ట్ విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు!

ఏలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాన్ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ కె.ఎం.అంబేద్కర్ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏలూరు సర్కిల్,ఏలూరు డివిజన్,జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారుకంట్రోల్ రూమ్ నంబర్లు:

ఏలూరు సర్కిల్ కార్యాలయం: 9440902926ఏలూరు డివిజన్ కార్యాలయం: 9440904037జంగారెడ్డిగూడెం డివిజన్: 9491030712విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్:1912

తుఫాన్,భారీ వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ భద్రతపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు.ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను,నేలకొరిగిన స్తంభాలను,స్టే వైర్లను,ట్రాన్స్‌ఫార్మర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని హెచ్చరించారు.

తడి చేతులతో స్విచ్‌లు వేయడం,కరెంట్ పరికరాలను ముట్టుకోవడం ప్రమాదకరమని స్పష్టం చేశారు.విద్యుత్ అంతరాయాలు లేదా ప్రమాదాలు జరిగిన వెంటనే పై కంట్రోల్ రూమ్ నంబర్లకు గానీ, స్థానిక విద్యుత్ అధికారులకు గానీ సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్