Eluru: కుక్కునూరులో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సమావేశం

Eluru: కుక్కునూరులో పోలవరం ముంపు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. గౌస్ డిమాండ్ చేశారు

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 8 Oct 2026 7:24 PM IST
Eluru
X

Eluru: కుక్కునూరులో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సమావేశం

Eluru: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, స్ట్రక్చర్‌ వాల్యూ చెల్లించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. గౌస్‌ డిమాండ్‌ చేశారు. నెమలిపేటలో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ పార్టీ కార్యకర్తల సమావేశం కంగాల కళ్లయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా గౌస్‌ మాట్లాడుతూ 41.15 కాంటూరు పరిధిలో పరిహారం అందని, పెండింగ్‌లో ఉన్న నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కల్పించాలని కోరారు. 2022 కటాఫ్‌ తేదీకి సంబంధించి పోలవరం జిల్లాలో అమలు చేసిన జీవోను ఏలూరు జిల్లాలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

45.72 కాంటూరు పరిధిలో ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోతున్న కుటుంబాలకు కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలని కోరారు. సమావేశంలో గడ్డాల ముత్యాలరావు, బాచినేని సత్యనారాయణ, కట్టం వీరస్వామి, ఎస్‌.కె. మున్ని, మచ్చ ప్రశాంత్‌, మడకం మల్లేష్‌, పట్ల బాబురావు, కంగాల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR