Eluru: ఓటు హక్కుతోనే పల్లెల సమగ్ర అభివృద్ధి: మంత్రి పార్థసారధి!
Eluru: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలను మంత్రి కొలుసు పార్థసారధి పరిశీలించారు. గ్రామసీమల సమగ్రాభివృద్ధికి ఓటు హక్కే కీలకమని ఆయన స్పష్టం చేశారు.
Eluru: ఓటు హక్కుతోనే పల్లెల సమగ్ర అభివృద్ధి: మంత్రి పార్థసారధి!
ఏలూరు: నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదర, బొద్దనపల్లి పంచాయతీశోభానాపురం,ఆగిరిపల్లి,తోటపల్లిగ్రామాల్లో గురువారం పలుపోలింగు స్టేషన్లో పోలింగు సరళిని పరిశీలించి,పోలింగు ప్రక్రియ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఓటర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి లభించిన అత్యంత పవిత్రమైన,శక్తివంతమైన ఓటుహక్కు మాత్రమేనని స్పష్టం చేశారు.
గ్రామసీమలు అభివృద్ధి సమగ్రాభివృద్ధి, సమర్థవంతమైన స్థానికసంస్థలు నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు అత్యంత కీలకమని తెలిపారు.ఎన్నికలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ఓటర్లందరూ పోలింగు కేంద్రాలకు తరలివచ్చి నిర్భయంగా,స్వతంత్రంగా నూటికి నూరుశాతం తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్నికలు అధికారులు,పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.




