Agiripalli: ఆగిరిపల్లిలో పంచాయతీ ఎన్నికల సందడి.. కూటమి ప్రచారం జోరు!

Agiripalli: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థి పామర్తి నర్సయ్య 14 మంది వార్డు అభ్యర్థులతో కలిసి ప్రజా సమస్యలే అజెండాగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 26 Nov 2026 11:05 AM IST
Agiripalli
X

Agiripalli: ఆగిరిపల్లిలో పంచాయతీ ఎన్నికల సందడి.. కూటమి ప్రచారం జోరు!

ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గ్రామ పంచాయతీ పీఠమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి పామర్తి నర్సయ్య మరియు 14 మంది వార్డు అభ్యర్థులు వాడవాడలా పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుసుకుంటున్నారు.

కేవలం ఓట్లు అడగడమే కాదు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. తాగునీటి ఇబ్బందులు. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం. వెలుగులు నింపాల్సిన వీధుల్లో చీకట్లు. అభివృద్ధికి నోచుకోని రహదారులు.

ఇవే ఆగిరిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలంటూ స్థానికంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ సమస్యలకు మంత్రి కోలుసు పార్థసారథి చొరవతో శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని పామర్తి నర్సయ్య చెబుతున్నారు. ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

టీడీపీ సర్పంచ్ అభ్యర్థి నర్సయ్య ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులకు కూడా మద్దతు తెలపాలని గ్రామస్తులను కోరుతున్నారు. మొత్తానికి ఆగిరిపల్లి పంచాయతీ ఎన్నికల వేళ అభివృద్ధి హామీలు, ప్రజా సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?ఆగిరిపల్లి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid