Eluru: ఏలూరులో విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు ఘనంగా నిర్వహణ
Eluru: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఏలూరు అల్లూరి స్టేడియంలో 82 రకాల క్రీడా పోటీలు; సుమారు 600 మంది పాల్గొని ప్రతిభ చాటుకున్నారు.
ఏలూరు: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు.విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ మూడు చక్రాల ట్రై సైకిల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించి, వారు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది అంధ,బధిర,శారీరక మరియు మానసిక విభిన్న ప్రతిభావంతులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని 82 రకాల క్రీడల్లో తమ ప్రతిభను చాటారు.గోపన్నపాలెం పీఈటీ కళాశాల ట్రైనీలు,పీఈటీ షణ్ముఖం పర్యవేక్షణలో ఈ పోటీలు విజయవంతంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి,హెన్రీ డొమినిక్, ఎ.వెంకట రమణ,విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వీరభద్రరావు, యుగంధర్,సారధి,నాగబాబు,ప్రవీణ్ వర్మ పాల్గొన్నారు.పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ అభినందించారు.




