Eluru: అక్టోబర్‌లో 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
Eluru: ఏలూరు జిల్లాలో అక్టోబర్‌లో 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు. CCLA జూమ్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి.
Eluru: అక్టోబర్‌లో 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
ఏలూరు: ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలలో 38 గ్రామాలకు చెందిన 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ (CCLA) జి.జయలక్ష్మి సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే 32 గ్రామాలలో 13,131 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని రెవెన్యూ అంశాల పురోగతిని ఆమె వివరించారు.22ఏ భూ సమస్యలు జూన్ 15 నుండి ఇప్పటివరకు అందిన 480 దరఖాస్తులలో 210 పరిష్కరించామని,నిబంధనల ప్రకారం లేని 193 దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు.
మిగిలిన 77 పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు.పిజిఆర్ఎస్ (PGRS)ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులను నేరుగా కలిసి, నాణ్యమైన పరిష్కారం అందిస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు CCLA జి.జయలక్ష్మి మాట్లాడుతూ.. పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని,రీ-సర్వే పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,ఆర్‌డీఓలు లక్ష్మీప్రసన్న,రమణ తదితరులు పాల్గొన్నారు.




