Eluru: 22ఏ జాబితా నుంచి తొలగింపునకు 217 దరఖాస్తులు ఆమోదం
Eluru: ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించగా, 217 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు.
Eluru: 22ఏ జాబితా నుంచి తొలగింపునకు 217 దరఖాస్తులు ఆమోదం
ఏలూరు: ఏలూరు జిల్లాలో గత 2 నెలల్లో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూ పరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి.జయలక్ష్మి కి తెలిపారు.22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం,తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి.జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు.అర్జీదారులు ఇంటికి వెళ్లి సమస్యను పూర్తిగా తెలుసుకుని నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.22ఏ జాబితా నుండి తొలగింపునకు అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలమేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని,నిబంధనల మేరకు లేని దరఖాస్తులను కారణాలను అర్జీదారులకు తెలియజేస్తూ తిప్పిపంపాలన్నారు.
అక్టోబర్ నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు.ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జూన్, 15వ తేదీ నుండి అక్టోబర్,5వ తేదీ వరకు జిల్లాలో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో నిబంధనల మేరకు అర్హత ఉన్న 217 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందన్నారు.
నిబంధనల మేరకులేని 217 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని,మిగిలిన వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.అక్టోబర్ నెలలో 33 గ్రామాలలో 23 వేల 128 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యానికి గాను 11 వేళా 440 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేశామని, మిగిలిన 11 వేల 688 పట్టాదార్ పాస్ పుస్తకాలను నిర్దేశించిన సమయంలోగా పంపిణీ చేస్తామన్నారు.
రైతుల ఈకెవైసి పూర్తిచేసి,రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం,సర్వే నెంబర్, తదితర వివరాలను పరిశీలించి తప్పులు లేకుండా తదుపరి నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ,ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ,ప్రభృతులు పాల్గొన్నారు.




