Denduluru: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వరి వంగడాలపై అవగాహన: కలెక్టర్!
Denduluru: దెందులూరు మండలం పోతునూరులో తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటలను ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం పరిశీలించి వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Denduluru: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వరి వంగడాలపై అవగాహన: కలెక్టర్!
దెందులూరు: దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణ రకం అధిక దిగుబడినిచ్చినప్పటికీ, తుఫాన్లు,భారీ వర్షాల సమయంలో పంట నేలకొరిగి రైతులు నష్టపోతున్నారన్నారు.
ప్రత్యామ్నాయంగా 1318,1121,పీఎల్ 1100 వరి వంగడాల సాగుపై రైతులకు అవగాహన కల్పించి,విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.
అదనపు డీఏపీ మంజూరు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా,ఇతర అధికారులు పాల్గొన్నారు.




