Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం!
Eluru: ఏలూరు జిల్లాలో అర్నాబ్ తుఫాను ప్రభావంతో విరుచుకుపడ్డ ఈదురుగాలులు, భారీ వర్షం. 28 మండలాల్లో 800.2 మి.మీ వర్షపాతం. ముదినేపల్లిలో అత్యధికం.
Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం!
Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత 24 గంటలుగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మొత్తం జిల్లాలోని 28 మండలాల్లో సగటున 800.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తెల్లవారుజాము నుండి భారీ ఈదురు గాలులు వీస్తూ ఉండటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.
గాలికి నేలకోరిగిన చెట్లను తొలగించి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తున్న అధికారులు.జిల్లాలో అత్యధిక వర్షపాతం ముదినేపల్లి మండలంలో 64.8 మిల్లీమీటర్లు నమోదు కాగా అతి తక్కువ వర్షపాతం నూజివీడు మండలంలో 11.6 మిల్లీమీటర్లుగా నమోదయింది.
జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి,జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.




