Eluru: ఏలూరు రైతుబజార్లలో 'ధరణి' నాణ్యమైన బియ్యం విక్రయాలు

Eluru: ఏలూరు జిల్లా రైతుబజార్లలో 'ధరణి' నాణ్యమైన సన్న బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. బిపిటి కిలో రూ.49, కెఎన్ఎమ్/ఆర్ఎన్ఆర్ రూ.50లకే అందుబాటులో ఉంటాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 8:17 PM IST
Eluru
X

Eluru: ఏలూరు రైతుబజార్లలో 'ధరణి' నాణ్యమైన బియ్యం విక్రయాలు

ఏలూరు: బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నుండి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ధరణి – నాణ్యమైన బియ్యం’ కార్యక్రమాన్ని చేపట్టిందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ విక్రయాలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.

కిలో BPT రకం రూ.49,KNM/RNR రకం రూ.50 లకే లభిస్తాయి అని వినియోగదారుల సౌకర్యార్థం 26 కిలోల బస్తాలుగా ప్యాక్ చేసి అందుబాటులో ఉంచారు అని ఏలూరు పత్తేబాద, వన్ టౌన్,నూజివీడు, మరియు కైకలూరు రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లలో ఈ బియ్యం దొరుకుతాయి అని ప్రజలందరూ రైతుబజార్లలో లభించే ఈ నాణ్యమైన ‘ధరణి’ సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్